తెలంగాణకు భారీ పెట్టుబడులు.. సీఎంతో ఒప్పందం!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సుమారు రూ.70 వేల కోట్లతో గిగావాట్ సామర్థ్యంతో దేశంలోనే అతి పెద్ద ఏఐ డేటా సెంటర్ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయబోతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకుంది. టీసీఎస్, హైపర్‌వాల్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్న ఈ డేటా సెంటర్ కారణంగా.. సుమారు 7 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ డేటా సెంటర్ హైదరాబాద్ నగరానికే కాకుండా ఇండియాకే తలమానికంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఏఐ ఆధారిత పరిశ్రమలు మరిన్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వివరించారు. 2028, జూన్ రెండో తేదీ నాటికి డేటా సెంటర్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. టీసీఎస్ సంస్థకు అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేస్తానని, ఎలాంటి అవసరం ఉన్నా తనన నేరుగా సంప్రదించాలని టీసీఎస్ ప్రతినిధులకు సూచించారు.

గిగా వాట్ సామర్థ్యంతో..

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ అంటే బిజినెస్ అని ఎన్నో సార్లు చెప్పామన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఫ్యూచర్ సిటీలో రూ.70 వేల కోట్లు పెట్టుబడులు రావడం కాంగ్రెస్ ప్రభుత్వ సుపరిపాలనకు సంకేతమన్నారు. తెలంగాణ రైజింగ్ మాటల్లో కాదు, చేతల్లో చూపించామన్నారు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో ఈ మేరకు అవగాహన కుదిరింది. అనేక విడతల చర్చల తరువాత డేటా సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ మొగ్గు చూపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>