Mobile Popup Ad
Mobile Popup Ad

త‌మిళ‌నాడు ఫ్యాక్ట‌రీ పేలుడు.. 23కు చేరిన‌ మృతుల సంఖ్య!

క‌లం, వెబ్‌డెస్క్‌: తమిళనాడులోని విరుదునగర్ (Virudhunagar) జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలో జ‌రిగిన‌ భారీ పేలుడులో మృతుల సంఖ్య భారీగాపెరుగుతోంది. కట్టనార్‌పట్టి గ్రామంలోని వనజ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభ‌వించింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌రికొంద‌రు మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 23 మంది మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. వీరిలో మ‌హిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాల‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

ఈ ప్ర‌మాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీ లోపల దాదాపు 50 మంది పని చేస్తున్నట్లు సమాచారం. దీపావళి బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. భ‌ద్ర‌తా లోపాల కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా భావిస్తున్నారు. పరారీలో ఉన్న‌ ప్యాక్టరీ యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్తున్నారు.

 Read Also: వేసవిలో పొలిటికల్ హీట్.. ఉమ్మడి ‘కరీంనగర్‌’లో కేసీఆర్, రేవంత్ పర్యటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>