ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ విజేతగా సాధ్వి సతీశ్​ సైల్

కలం, వెబ్​ డెస్క్​: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో (Bhubaneswar) గ్రాండ్​గా  జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలేలో గోవాకు చెందిన సాధ్వి సతీశ్​ సైల్ (Sadhvi Satish Sail) విజేతగా నిలిచారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలో మహారాష్ట్రకు చెందిన రాజనందిని పవార్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, కేంద్రపాలిత ప్రాంతాల (జమ్మూ కాశ్మీర్) తరపున శ్రీ అద్వైత సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. 61వ ఎడిషన్‌గా జరిగిన ఈ వేడుకలో దేశవ్యాప్తంగా 30 మంది అందాల భామలు పాల్గొన్నారు.

గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా సాధ్వి (Sadhvi Satish Sail) కిరీటాన్ని అందుకున్నారు. సాధ్వి సతీశ్​ మోడల్​తో పాటు వ్యాపారవేత్త కూడా.  రాబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.

Read Also: ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం.. హెలికాప్టర్​లో జగిత్యాలకు KCR

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>