కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం అక్కడి ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది. కరెంటు బిల్లులపై భారీ సబ్సిడీ ఇవ్వబోతున్నది. ఇరాన్ యుద్ధం సంక్షోభం ఎంతకాలం కొనసాగితే అంతవరకు తమిళనాడులో లైసెన్స్ ఉన్న, లేని టీ స్టాల్స్, హోటల్స్, క్లౌడ్ కిచెన్.. ఇలాంటి ఫుడ్ ఈటరీస్ అన్నిటికీ కరెంట్ బిల్లులపై భారీ సబ్సిడీ ప్రకటించింది. ప్రస్తుతం గృహ వినియోగదారులు, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ కోర్టుల్లోనూ ఎలక్ట్రిక్ స్టవ్ వినియోగం పెరిగింది. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యుత్ బిల్లులపై రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రతీ యూనిట్ మీద రూ. 2 చొప్పున సబ్సిడీ ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తక్షణం ఇది అమల్లోకి వస్తుందని, ఎల్పీజీ సంక్షోభం తొలగేంత వరకు ఈ వెసులుబాటు కంటిన్యూ అవుతుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు.
కేవలం కరెంట్ స్టవ్ వాడకం వల్ల బిల్లు పెరిగిందా?.. లేక ఏసీ వల్ల పెరిగిందా?.. ఇలాంటి వివరాలేవీ అడగబోమని, బిల్లులో ఒక్కో యూనిట్‌కు రూ. 2 చొప్పున డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. దీనికి తోడు రేషన్ దుకాణాల ద్వారా ఇప్పుడు అందుకుంటున్న కిరోసిన్ కోటాకు అదనంగా అంతే మొత్తంలో సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య, వారికి ఎల్పీజీ కనెక్షన్ కింద ఉన్న సిలిండర్ల సంఖ్యను బట్టి నెలకు 3-15 లీటర్ల చొప్పున కిరోసిన్ సరఫరా జరుగుతున్నది.
Read Also: వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. తమిళనాడు ఎలక్షన్ ఎఫెక్ట్?
Follow Us On: Instagram

