వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. తమిళనాడు ఎలక్షన్ ఎఫెక్ట్?

కలం, నేషనల్ డెస్క్: సాహిత్యంలో విశేష కృషి చేసినవారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జ్ఞానపీఠ్ అవార్డు (Jnanpith award) ఈ సంవత్సరం తమిళ రచయిత వైరముత్తు(Vairamuthu)కు లభించింది. గతంలో జయకాంతన్ (2002), అఖిలన్ (1975) తదితరులకు ఈ అవార్డు ప్రదానమైంది. దాదాపు పదిహేను సంవత్సరాలుగా (2010 నుంచి) ఈ అవార్డు తమిళనాడుకు దక్కలేదు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడును మరోసారి వరించినట్లయింది. తమిళ సినీ నేపథ్య గాయని శ్రీపాద చిన్మయి గతంలో వైరముత్తుపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వేధింపులకు గురిచేశారంటూ తమిళ చిత్ర పరిశ్రమ సంఘం ప్రతినిధులకు కూడా ఫిర్యాదు చేశారు. దీర్ఘకాలం పాటు ఈ వివాదం సినీ ఇండస్ట్రీని కుదిపేసింది.

ఓటు బ్యాంక్ అస్త్రమా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జ్ఞాన్‌పీఠ్ అవార్డు తమిళనాడు రచయిత వైరముత్తు (Vairamuthu)కు దక్కడం గమనార్హం. ఎన్నికలకు అవార్డు ప్రదానం వ్యవహారానికి సంబంధం లేకపోయినా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో భాగంగా సెంటిమెంట్‌ అస్త్రంగా మారుతుందనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతున్నది. 1972లో వైగరై మేఘంగళ్ అనే రచనతో మొదలైన ఆయన సాహిత్య ప్రస్థానంలో సుమారు 40 పుస్తకాలను రచించారు. సినిమాల్లో దాదాపు ఏడున్నర వేల పాటలు రాశారు. కొన్ని దశాబ్దాల తర్వాత తమిళనాడుకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు దక్కడం విశేషం. ఈ అవార్డుకు ఎంపికైన తమిళ రచయితల్లో అఖిలన్, జయకాంతన్ తర్వాత మూడవ రచయిత వైరముత్తు.

Read Also: పెట్రోల్ విడిగా అమ్మితే కఠిన చర్యలే: కేంద్రం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>