జపాన్​‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

కలం, వెబ్ డెస్క్ : జపాన్ లో మంగళవారం భారీ భూకంపం (Japan Earthquake) సంభవించింది. కుమామోటో ప్రిఫెక్చర్‌లో రిక్టర్ స్కూల్​ పై 7.1 తీవ్రతతో భూమి కంపించింది అని జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించింది. ఈ క్రమంలో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ దక్షిణ క్యుషు ద్వీపంలోని కుమామోటో, నాగసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్‌లకు జపాన్ ప్రభుత్వం అత్యవసర భూకంప హెచ్చరికలను జారీ చేసింది.

ప్రపంచంలోనే అత్యంత భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ముందువరుసలో ఉంటుంది. పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” పశ్చిమ అంచు వెంబడి ఉన్న నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లపై ఉన్న ఈ దేశంలో ప్రపంచంలోని భూకంపాలలో సుమారు 18 శాతం ఇక్కడే సంభవిస్తాయి. సుమారు 125 మిలియన్ల జనాభా ఉన్న ఈ ద్వీపమూహంలో ప్రతి ఏటా 1500 భూకంపాలు సంభవిస్తాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>