సారీ చెప్పిన విజయ్ ప్రభుత్వం.. ఎందుకో తెలుసా!

కలం, వెబ్ డెస్క్: తిరుప్పరంకుండ్రం (Thiruparankundram) కొండపై దీపం వెలిగించలేకపోయినందుకు తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సారీ చెప్పింది. ప్రభుత్వ పరంగా మంగళవారం అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఆలయ బోర్డు నుంచి సహకారం లేనందునే దీపం వెలిగించకలేకపోయామని స్పష్టం చేసింది. ఈ మేరకు మధురై కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారు. సంప్రదాయాన్ని కొనసాగించేందుకు పోలీసులు, స్థానిక అధికారులు సిద్ధమైనా.. ఆలయ సిబ్బంది ముందుకు రాలేరని వివరించారు. దీపతూన్ రాతి స్తంభంపై కాకుండా దానికి సమీపంలోని ఉచ్ఛిపిళ్లయార్ ఆలయంపై ఏటా వస్తున్న ఆనవాయితీ ప్రకారం కార్తీక దీపం వెలిగించామని స్పష్టం చేశారు.

ఉద్దేశపూర్వకంగా అలా చేశారు..

ఆలయ బోర్డు నిర్ణయం తమకు ఆశ్చర్యం కలిగించిందని, వారి కారణంగానే తాము కోర్టు ఆదేశాలు అమలు చేయలేకపోయినందుకు మన్నించాలని మధురై కలెక్టర్ తెలిపారు. ప్రతివాదులుగా హిందూ పిటిషనర్లు మాత్రం ఉద్దేశపూర్వకంగా విజయ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలను పక్కనపెట్టిందని విమర్శించారు. ప్రస్తుతానికి ఈ వివాదం కొంత సద్దుమణిగినా.. దీనిపై త్వరలోనే సుప్రీం కోర్టులో పూర్తి స్థాయి వాదనలు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బుధవారం కొండ సమీపంలో బీజేపీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన దిగాయి. విజయ్ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించాయి.

Also Read : పార్టీ ముసుగులో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>