కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రీత్ విహార్ (Delhi Preet Vihar) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. కర్కర్దూమాలోని క్రాస్ రివర్ మాల్‌లో ఉన్న ఒక కేఫ్‌లో బాధితురాలు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇటీవల ఎనిమిది మంది కలిసి ప్రీత్ విహార్‌లోని కేఫ్‌లో అర్ధరాత్రి పార్టీ చేసుకున్నారు. కేఫ్ మూసివేసే సమయం దాటిన తర్వాత కూడా, వారి వద్ద తాళం చెవి ఉండటంతో లోపలే ఉండి మద్యం సేవిస్తూ పార్టీని కొనసాగించారు. పార్టీ ముగిసిన అనంతరం ఇద్దరు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు అక్కడున్న మిగతా నిందితులు కూడా సహకరించినట్లు ఆమె ఆరోపించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

