కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయ సంక్షోభం మధ్య కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించింది. సంఖ్యాబలం రాజకీయాల మధ్య కాంగ్రెస్ అప్రమత్తమై.. ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మిగతా పార్టీలను కూడగట్టడంలో నిమగ్నమైంది. ఈ క్రమంలో.. ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రమాణ స్వీకారంపై వీడని సస్పెన్స్..
మెజార్టీకి అవసరమైన ఎమ్మెల్యేల బలం తనకు ఉందని గవర్నర్‌ను కలిసి విజయ్ లేఖ అందించారు. అయితే, అందులో 116 మంది సంతకాలే ఉండటంతో గవర్నర్ మళ్లీ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో, రేపటి ప్రమాణ స్వీకారం ఉంటుందా.. లేదా.. అనేది చర్చనీయాంశంగా మారింది.

