Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో అవినీతిపై ఉక్కుపాదం మోపేలా ముఖ్యమంత్రి విజయ్‌ (CM Vijay) నేతృత్వంలోని ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం వెయ్యి రూపాయలు లంచం (Bribery) అడిగినా, ఆ విషయాన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే సదరు పౌరుడికి ఏకంగా రూ. లక్ష నగదు బహుమతిని అందజేయనున్నట్లు ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అవినీతి అధికారుల గుట్టురట్టు చేసేందుకు నేరుగా ప్రజల నుంచే సమాచారాన్ని సేకరించాలని సీఎం నిర్ణయించారు.

ఇందులో భాగంగానే బాధితులు, సామాన్య ప్రజలు సులువుగా ఫిర్యాదు చేసేందుకు చర్యలు కూడా తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను, అత్యాధునిక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను, పటిష్టమైన ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నిర్ణయంతో వ్యవస్థలో అవినీతికి శాశ్వతంగా అడ్డుకట్ట పడనుందని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

 Read Also: HYD మెట్రో రెండో ద‌శపై కేంద్రానికి ఇబ్బంది లేదు: కిషన్ రెడ్డి

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>