వివాహితను వేధించిన యువకుడికి షాక్ ట్రీట్‌మెంట్.. గుండు కొట్టి ఆపై!

కలం, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. పని ప్రదేశాల్లో, బస్సుల్లో, రోడ్లపై, కాలేజీల దగ్గర ఎక్కడో ఒకచోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఓ వివాహితను వేధించిన యువకుడికి గుండు కొట్టి ఊరేగింపు చేసిన ఘటన అనంతపురం (Anantapur) జిల్లా గడేకల్‌ (Gadekal) లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. విడపనకల్ మండలం గడేకల్‌ (Gadekal) లో గత కొంత కాలంగా ఓ యువకుడు వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సదరు మహిళ తనకు ఇష్టం లేదని పలుమార్లు చెప్పిన ఆ యువకుడు పట్టించుకోకుండా ఆ మహిళను ఇబ్బంది పెడుతూనే వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతడిని పట్టుకుని గుండు కొట్టించారు. అంతటితో ఊరుకోకుండా యువకుడికి గుండు కొట్టించి ఆపై డప్పు చప్పుళ్లతో ఊరేగించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 Read Also: తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>