కలం, యాదాద్రి భువనగిరి: కౌండిన్య గౌడ సంఘం (Koundinya Gouda Sangam) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన కూనూరు నిరంజన్ గౌడ్ (Niranajan Goud) నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో కౌండిన్య గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది కె.ఎల్.ఎన్. ప్రసాద్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు కె.ఎల్.ఎన్. ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంకితభావంతో పనిచేస్తూ కౌండిన్య గౌడ సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తానని చెప్పారు.
పేద గీత కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నిరంజన్ గౌడ్ పేర్కొన్నారు. సంఘం అభివృద్ధికి నాయకులు, సభ్యుల సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర నాయకులు కందికంటి రాజా గౌడ్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నిరంజన్ గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన సంఘం నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

