కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం అన్నయ్య (Brahmanandam Brother) శ్రీ వదన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ కుటుంబంలో ఆరుగురు సోదరులు ఉండగా, ఇప్పటికే నలుగురు మృతి చెందారని, ప్రస్తుతం తాను ఒంటరిగా మిగిలిపోయానని శ్రీ వదన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత ఊరికి వచ్చినప్పటికీ బ్రహ్మానందం తనను కలవలేదని ఆరోపించారు. తన తమ్ముడు ఫోన్ చేసి “ఏరా అన్నయ్యా.. ఎలా ఉన్నావ్?” అని ఒక్కసారి అడిగినా చాలని, తనకు అంతకంటే ఏమీ అవసరం లేదని భావోద్వేగానికి గురయ్యారు.
అయితే ఈ వ్యాఖ్యలపై బ్రహ్మానందం స్పందిస్తూ తన అన్నయ్య మానసికంగా స్థిరంగా లేరని.. ఎవరో యూట్యూబర్ ఆయనతో అలా మాట్లాడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్నయ్య శ్రీ వదన్ కుటుంబానికి చాలా కాలంగా సహాయం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

