మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ భారీ స్కామ్.. కేసు నమోదు

కలం, నిర్మల్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు (Rekha Naik) చెందిన ఏఆర్ఎస్ రైస్ మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం కొరత ఉన్నట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ మండలం సత్తనపల్లి గ్రామంలోని మిల్లులో 2022-23, 2023-24, 2024-25 రబీ సీజన్లకు సంబంధించిన ప్రభుత్వ ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అధికారుల అంచనా ప్రకారం ఈ ధాన్యం విలువ సుమారు రూ.40.96 కోట్లు ఉంటుందని తెలిపారు. మిల్లులోని ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించిన అధికారులు.. ప్రభుత్వానికి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్‌ (CMR)ను లెక్కల్లో చూపకుండా దారి మళ్లించినట్లు, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లు నివేదిక రూపొందించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సుధాకర్ బుధవారం ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 165/2026 కింద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 316(2), 316(5), 318(4)తో పాటు ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విజిలెన్స్ తనిఖీల్లో బయటపడిన ప్రభుత్వ ధాన్యం కొరత, సీఎంఆర్‌ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికారులు గుర్తించిన కొరతకు సంబంధించిన వివరాలు, ధాన్యం నిల్వలు, రికార్డులపై మరింత విచారణ చేపడుతున్నారు.

Also Read : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసులో విజిలెన్స్ సోదాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>