Mobile Popup Ad
Mobile Popup Ad

ఇటలీ ప్రధాని మెలోనికి మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్.. వీడియో వైరల్!

కలం, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), ఇటలీ ప్రధానమంత్రి మెలోని (Giorgia Meloni) మధ్య జరిగిన సరదా సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు మెలోడీ చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. దానిని ఎంతో సంతోషంగా స్వీకరించిన మెలోని ఆ క్షణాన్ని తన మొబైల్‌లో వీడియో కూడా తీసుకున్నారు. అనంతరం ఆ వీడియోను తన ఎక్స్‌లో షేర్ చేశారు. గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్యూ అని క్యాప్షన్ పెట్టారు. ఈ సందర్భంగా మెలోడీ అనే పదాన్ని ప్రస్తావిస్తూ సరదాగా నవ్వుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గ్లోబల్ లీడర్స్ మధ్య ఉన్న ఈ స్నేహబంధానికి సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

 Read Also: HYD మెట్రో రెండో ద‌శపై కేంద్రానికి ఇబ్బంది లేదు: కిషన్ రెడ్డి

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>