Mobile Popup Ad
Mobile Popup Ad

HYD మెట్రో రెండో ద‌శపై కేంద్రానికి ఇబ్బంది లేదు: కిషన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు మరో కీలక అడుగుపడింది. ఈ మేరకు సెకండ్ ఫేజ్ కు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మెట్రో రెండో ద‌శ (Hyderabad Metro) విస్త‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి అభ్యంత‌రం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో (Manohar Lal Khattar) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ కీల‌క ప్రాజెక్టుల‌పై చ‌ర్చించారు. కేంద్ర, రాష్ట్రం 50:50 భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపామని కేంద్ర మంత్రి ఖట్టర్ చెప్పారు. డీపీఆర్ అందిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

అమృత్ 2.0 పథకంలో భాగంగా మూసీనదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మంజూరు చేసింద‌ని కిషన్ రెడ్డి (Kishan Reddy) చెప్పారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.3,975 కోట్లని వివరించారు. హైదరాబాద్ లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణాపై చర్చించామని తెలిపారు. మెట్రో (Hyderabad Metro) రెండో ద‌శ‌ ప్రాజెక్టు విస్త‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని వివరించారు. దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్‌ చెప్పారని పేర్కొన్నారు.

Read Also: తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>