కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీవీకే అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా 7న నిర్వహించాలనుకున్న టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేసింది. ఈ మేరకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిసార్ట్ లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు టీవీకే అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
నిజానికి మే 7న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించుకున్నా టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) బుధవారం ప్రభుత్వ ఏర్పాటు కోసం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కు సమర్పించారు. తమ పార్టీతో పాటు కాంగ్రెస్ కు చెందిన 5 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వెల్లడించారు. తమిళనాడు శాసనసభలో తమదే అతిపెద్ద పార్టీ అని, తనకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు లేఖను అందించారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వం పై సస్పెన్స్ నెలకొంది.
Read Also: ఐ ప్యాక్‌తో అఖిలేష్ కటీఫ్!
Follow Us On: WhatsApp

