కలం, వరంగల్ బ్యూరో: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. హనుమకొండ రాంనగర్‌లో ఉన్న తన నివాసంలో ఆమె స్వీయ గణనలో వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా జనగణన ప్రక్రియ వేగవంతంగా పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. ప్రజలంతా సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని వినియోగించుకుని ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
మే10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. మే 11 నుండి ఇంటింటికి వెళ్లే ఎన్యూమరేటర్లకు తమకు ఇచ్చిన ఐడీ నంబర్‌ను తెలియజేయాలని మంత్రి (Konda Surekha) సూచించారు. దీంతో తమ వివరాలు అధికారికంగా జనగణనలో నమోదు అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపకమిషనర్ ప్రసన్న రాణి, రెవెన్యూ అధికారి శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: వియత్నాం అధ్యక్షుడితో మోదీ భేటీ.. కీలక చర్చలు
Follow Us On: WhatsApp

