Mobile Popup Ad
Mobile Popup Ad

దూసుకెళ్తున్న టీవీకే.. టెంట్లు తొలగిస్తున్న డీఎంకే!

కలం, వెబ్​ డెస్క్​ : తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సంచలనం నమోదవుతోంది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎర్లీ ట్రెండ్స్‌లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే అభ్యర్థులు భారీ ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ వంటి కీలక నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ స్పష్టమైన మెజారిటీని కనబరుస్తోంది. రాజధాని చెన్నై మినహా రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ టీవీకే హవా కొనసాగుతుండటం గమనార్హం.

ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం టీవీకే 106 స్థానాల్లో ముందంజలో ఉండగా, అన్నాడీఎంకే 74 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. అధికార డీఎంకే కేవలం 50 స్థానాలకే పరిమితమై మూడో స్థానానికి పడిపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం వద్ద అప్పుడే టెంట్లు తొలగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు టీవీకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోతుంటే, మరోవైపు అధికార పార్టీ క్యాంప్‌లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.

Read Also: నౌకలకు రక్షణ: ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ప్రకటించిన ట్రంప్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>