కలం, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా నడుం బిగించింది. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ పేరుతో అమెరికా ఈ నౌకలకు రక్షణ కవచంగా నిలవనుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆయన వివరాలను వెల్లడించారు.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న వివాదాలతో ఏమాత్రం సంబంధం లేని అనేక దేశాలు తమ నౌకల రక్షణ కోసం అమెరికా సాయాన్ని కోరినట్లు ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) చిక్కుకుపోయిన ఈ నౌకలు పూర్తిగా తటస్థ దేశాలకు చెందినవని, అమాయక ప్రయాణికులు మరియు వ్యాపారులు ఇందులో ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. ఇరాన్, మధ్యప్రాచ్యం మరియు అమెరికా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా దేశాల నౌకలను సురక్షితంగా నిర్బంధ జలమార్గాల నుండి బయటకు నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అంతర్జాతీయ వాణిజ్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ప్రపంచ దేశాల అభ్యర్థన మేరకు చేపడుతున్న ఈ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ద్వారా సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణాను పునరుద్ధరించడమే లక్ష్యమని ట్రంప్ (Trump) తన సందేశంలో ఉద్ఘాటించారు.
Read Also: సినీ తారలకే తమిళ తంబీలు పట్టాభిషేకం.. ఎంజీఆర్ నుంచి విజయ్ దాకా!
Follow Us On: X(Twitter)

