స‌ర్కార్‌కు పాలమూరు వర్సిటీ బీసీ విద్యార్థి సంఘం కీల‌క డిమాండ్‌

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్‌న‌గ‌ర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్‌కు ఇవ్వాలంటూ పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ నేతలు మాట్లాడారు. పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని స్థానిక బీసీ సమాజంలో బలమైన నాయకుడు సంజీవ్ ముదిరాజ్‌కి కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో 171 ఆర్టికల్ ప్రకారం సమాజంలో సాహిత్యం, సామాజిక సేవ ,సామాజిక ఉద్యమాలు తదితర రంగాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తారాని, కాబట్టి బీసీ సమాజంలో బలమైన నాయకుడు ప్రజాదారణ కలిగిన వ్యక్తి కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌కే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, మండల, నియోజకవర్గ, బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం.పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నారని ఆయన అన్నారు.

యువత, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు సంస్థాగత ప్రాతినిథ్యం ఇవ్వడంతో పాటు ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం చేస్తున్నారని ఆయన అన్నారు. సంజీవ్ ముదిరాజ్ ఎమ్మెల్సీ స్థానానికి కేటాయిస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ ,రాజకీయ రంగాల్లో బీసీలకు అవకాశాలు కల్పించిన వారు అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి నాయకులు అశోశ్‌, కిషోర్, నవీన్, శివ, తదితర నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>