కలం, వెబ్ డెస్క్ : ఇటలీ నుంచి న్యూజెర్సీకి వస్తున్న ఓ విమానం ట్రక్కును ఢీ కొట్టింది (Flight Strikes Truck). ఈ ఘటనలో ట్రక్కు పూర్తిగా దెబ్బతినగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం న్యూజెర్సీలోని నేవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు వస్తున్న బోయింగ్ 767 విద్యుత్ స్తంభంతో పాటు ఒక ట్రక్కును ఢీ కొట్టింది.
అయితే, ట్రక్కును ఢీ కొట్టినా విమానం (Flight Strikes Truck) సురక్షితంగా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో ఫ్లైట్ లో 221 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది కూడా ఉన్నారు. గాయపడిన ట్రక్కు డ్రైవర్ ను అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపిన అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Local news is now reporting that UA169 also struck a bakery truck while it was traveling northbound on the New Jersey Turnpike https://t.co/Mq9hpNLmHz pic.twitter.com/wcEBQ9ay1w
— Breaking Aviation News & Videos (@aviationbrk) May 3, 2026
Read Also: తమిళనాడు ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

