గవర్నర్ సంచలన నిర్ణయం.. తమిళనాడు శాసనసభ రద్దు

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని లోక్ భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త అసెంబ్లీ కొలువు దీరేందుకు అనుగుణంగా, సభను వెంటనే రద్దు చేస్తున్నట్లు లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధికంగా 108 స్థానాలు సాధించినా.. మేజిక్ ఫిగర్ 118 స్థానాలకు చేరుకోలేదు. దీంతో, ఇతర పార్టీల సాయంతో ఈ సంఖ్య 112కి చేరినా.. మెజార్టీ లేని కారణంగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించారు.

మరికాసేపట్లో తేలిపోతుందా..?

విజయ్ (Vijay) ప్రమాణ స్వీకారానికి ఓ వైపు చక చకా ఏర్పాట్లు జరుగుతుంటే.. గవర్నర్ ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై రాత్రి 8 గంటల తరువాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read Also: తమిళనాడు ప్రభుత్వంపై సస్పెన్స్.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం..?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>