Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు ప్రభుత్వంపై సస్పెన్స్.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం..?

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ నెలకొంది. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్ల బలం లేకపోవడంతో టీవీకే చీఫ్ విజయ్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విజయ్ కు ఊరట కలిగించే వార్త అందుతోంది. విజయ్ టీవీకే పార్టీలో చేరేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజయ్ తో పొత్తుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారని వార్త కథనాలు వెలువడుతున్నాయి.

అన్నాడీఎంకే నుంచి గెలిచిన 47 ఎమ్మెల్యేల్లో దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామిని ఒప్పించేందుకు సదరు ఎమ్మెల్యేలు మంతనాలు  ప్రారంభించారని సమాచారం అందుతోంది.  దీనికి  ఒకవేళ పళనిస్వామి ఒప్పుకోకుంటే షాకింగ్ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది.

తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందింది. 2 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన విజయ్ ఒక సీటుకు రాజీనామా చేశారు. దీంతో టీవీకేకు 107 సీట్లు ఉండగా.. 5 సీట్లు ఉన్న కాంగ్రెస్ మద్ధతు ప్రకటించింది. దీంతో పార్టీ బలం 112కు చేరింది. ఈ నేపథ్యంలోనే టీవీకే  ప్రభుత్వ ఏర్పాటు కు గవర్నర్ నిరాకరించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే వార్త తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో  తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఆసక్తి నెలకొంది.

Read Also: తెలంగాణకు ప్రధాని మోదీ.. ఇదే పూర్తి షెడ్యూల్!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>