లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బోధన్ ఎస్ఐ

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఓ ఎస్ఐ ఏసీబీ వలకు చిక్కాడు. బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు జరిపింది. బోధన్ టౌన్ సబ్ ఇన్స్‌పెక్టర్ భాస్కర్ చారి రూ.7 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఒక వ్యక్తి తన తమ్ముని కొడుకును క్రిమినల్ కేసులో నుంచి తప్పించడానికి ఎస్ఐ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు.

అయితే రూ.7 వేలు ఉన్నాయని చెప్పి బాధితులు ముందుగా ఆ డబ్బులు ఇచ్చారు. ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని హైదారాబాద్ తరలించారు. ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఏ పని కోసం అయినా లంచం డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని శేఖర్ గౌడ్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>