Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ పంటలే సాగు చేయండి.. నల్లగొండ కలెక్టర్ సూచన

కలం, నల్లగొండ: రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, భూములకు అనుగుణంగా పంటలు వేయాలని నల్లగొండ (Nalgonda)  జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. రైతు వారోత్సవాల్లో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ రైతు వేదికలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు.

సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ

భూములకు అనుకూలంగా ఉండే పంటలు పండిస్తే అధిక దిగుబడులతో పాటు అధిక లాభాలు సాధించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను (Health Cards) మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఆయా గ్రామాలలోని భూములకు అనుగుణంగా పంటలు వేసేందుకు జిల్లా యంత్రాంగం తరుపున అవసరమైతే ఒక డ్రైవ్ లా భూముల సారవంతం పరిశీలిస్తామని తెలిపారు. పండిన పంటకు పూర్తిస్థాయిలో లాభం వచ్చినప్పుడే రైతు అలాంటి పంటల వైపు మొగ్గు చూపుతాడని, మార్కెట్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.

పంట మార్పిడి చేయాలి

రైతులు ఒకే పంటను పండించకుండా అన్ని రకాల పంటలు పండించాలని, ప్రస్తుత వ్యవసాయ పద్ధతులు, కొత్తగా వస్తున్న మార్పులపై దృష్టి సారించి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా పంటలు పండించాలని చెప్పారు. పండించిన పంటల ద్వారా అధిక లాభాలు పొందేందుకు ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు వినియోగించుకొని పంటలు నిల్వ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు.

వ్యవసాయంలో మార్పులు అవసరం

వ్యవసాయంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. వరిలో ఎల్లప్పుడూ దొడ్డు బియ్యం కాకుండా, డిమాండ్ ఉన్న సన్న బియ్యం ఇతర రకాల ధాన్యాన్ని పండించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో నల్లగొండ మేయర్ (Nalgonda Mayor) బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పిఎసిఎస్ అధ్యక్షులు నాగరత్నరాజు, సహదేవరెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, ఎల్డిఎం శ్రామిక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ పాల్గొన్నారు.

Read Also: కేటీఆర్‌కు మతి భ్రమించింది.. ఎమ్మెల్యే నాయిని ఫైర్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>