టీమిండియాలోకి కొత్త పేసర్ గుర్నూర్.. అసలు అతనెవరు?

కలం, వెబ్ డెస్క్:  ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే హోమ్ సిరీస్ కోసం సెలెక్టర్లు మంగళవారం ప్రకటించిన భారత జట్టులో పంజాబ్ యువ పేసర్ గుర్నూర్ (Gurnoor)  బ్రార్ తొలిసారిగా చోటు సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. పంజాబ్‌లోని ముక్త్సార్‌కు చెందిన ఈ 25 ఏళ్ల కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్, ఆరు అడుగుల ఐదు అంగుళాల (6’5″) అసాధారణ పొడవుతో గుర్తింపు పొందాడు. 2022 డిసెంబర్‌లో రైల్వేస్‌పై ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన గుర్నూర్, తన మొదటి ఇన్నింగ్స్‌లోనే 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు ఆడిన 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీసిన రికార్డు ఇతనికుంది.

అలాగే 2021-22 విజయ్ హజారే ట్రోఫీలో అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కలిసి లిస్ట్-ఎ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గుర్నూర్, షేర్-ఎ-పంజాబ్ టీ20 కప్ 2024లో ఏకంగా 22 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఆరాధ్యదైవంగా భావించే గుర్నూర్, ఆయన నైపుణ్యాలను చూసే బౌలింగ్ వైపు వచ్చానని గతంలో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో 2023 సీజన్ ద్వారా పంజాబ్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన గుర్నూర్‌ను, ప్రస్తుత 2026 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టు కొనుగోలు చేసింది. జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఈ పొడుగు పేసర్ అంతర్జాతీయ వేదికపై ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>