కలం, మెదక్ బ్యూరో: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. నర్సాపూర్ (Narsapur) ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రభుత్వం కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
వివాహ సమయంలో పేదింటి ఆడపిల్లకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు. కోర్టు కేసులు చూపించి ఈ పథకం అమలు ఆపివేస్తే పోరాటం చేస్తామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

