టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ : కలవరపెడుతున్న టాస్​ హిస్టరీ!

కలం, వెబ్​ డెస్క్​: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. టాస్ (Toss Curse) గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో, టీమిండియా ఇప్పుడు ఒక క్లిష్టమైన సవాల్​ ఎదుర్కోబోతోంది. 2010 నుంచి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో టాస్ గెలిచిన జట్టే టైటిల్‌ను ముద్దాడుతూ వస్తోంది. ఈ ‘టాస్ శాపాన్ని’ చెరిపివేసి భారత్ కొత్త చరిత్ర లిఖిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ కీలక మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తన జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు(Toss Curse). తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని, దేశమంతా వారికి మద్దతుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, కివీస్ కెప్టెన్ శాంట్నర్ మాట్లాడుతూ.. ట్రోఫీ గెలిచే క్రమంలో ప్రత్యర్థి అభిమానుల మనసు గాయపడినా తమకు అభ్యంతరం లేదని, లక్షకు పైగా భారత అభిమానుల మధ్య ఆడుతున్నా తమ వెనుక స్వదేశీ ప్రజల అండ ఉందని ధీమా వ్యక్తం చేశారు. భారత సారథి సూర్యకుమార్ యాదవ్ సైతం జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా, పాత రికార్డులను బ్రేక్ చేసే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

Read Also: జాన్వీకపూర్ చేస్తే తప్పు లేదు.. నేను చేస్తే తప్పా : దివ్వెల మాధురి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>