నర్సాపూర్‌లో కల్తీ పాల దందా గుట్టు రట్టు.. నకిలీ పాలు స్వాధీనం

కలం, మెదక్ బ్యూరో: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కృత్రిమ పాలు తయారు చేస్తున్న ముఠాను నర్సాపూర్ పోలీసులు పట్టుకున్నారు. మెదక్ (Medak) జిల్లా నర్సాపూర్ (Narsapur) మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ పాలు (Adulterated Milk) తయారు చేస్తున్న ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కెమికల్స్, మిల్క్ పౌడర్ ఉపయోగించి కృత్రిమంగా పాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇంటిలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న 150 లీటర్ల కల్తీ పాలు, భారీ మొత్తంలో మిల్క్ పౌడర్, కల్తీ పాలు తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాలు, రసాయనాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కృత్రిమ పాలు తయారు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కేవలం లాభాల కోసమే ఈ కల్తీ పాలను తయారు చేసి మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ పాలను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు? ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>