Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

కలం, నల్లగొండ బ్యూరో : హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ఆదివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చిట్యాల (Chityal) మండలం గుండ్రాంపల్లి వద్ద హైవేపై ప్రయాణిస్తున్న ఒక భారీ లారీ సాంకేతిక కారణాలతో అకస్మాత్తుగా నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పెద్దకాపర్తి నుంచి గుండ్రంపల్లి వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు దీరాయి. ఆదివారం సెలవు దినం కావడంతో హైవేపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, లారీని అక్కడి నుండి తొలగించడం కష్టంగా మారింది. భారీ వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో పరిస్థితిని అదుపులోకి తేవడంలో పోలీసులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.

Read Also: 102 మంది పిల్లలు.. ఇక ఆపేస్తా అంటున్న ఉగాండా తండ్రి!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>