జాన్వీకపూర్ చేస్తే తప్పు లేదు.. నేను చేస్తే తప్పా : దివ్వెల మాధురి

కలం, వెబ్ డెస్క్ : దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి (Divvala Madhuri) తరచూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉన్నారు. రీసెంట్ గా వీరిద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి వెళ్లారు. అక్కడ బిగ్ బాస్ తనూజ బర్త్ డే సందర్భంగా కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి. ఈ అంశం పెద్ద ఎత్తున వివాదం అయింది. టీటీడీ రూల్స్ ప్రకారం కొండపై కేక్ కట్ చేయొద్దని తెలియదా అంటూ చాలా మంది ట్రోల్స్ చేశారు. కొన్ని చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ అంశంపై దువ్వాడ శ్రీనివాస్, మాధురి (Divvala Madhuri) ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తమకు కేక్ చేయొద్దనే రూల్ తెలియదని.. ఇందులో తనూజ తప్పేం లేదన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. ఎవరికీ భయపడేది లేదన్నారు. తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడిన మాధురి.. ‘కొండపై జాన్వీకపూర్ గతంలో కేక్ కట్ చేస్తే ఎలాంటి తప్పు లేదు. ఎంతో మంది కేక్ కట్ చేశారు. కానీ అప్పుడేం అనలేదు. నేను కట్ చేస్తేనే దాన్ని పెద్ద నేరంగా మాట్లాడుతున్నారు. ఎవరు నా గురించి ఎలా మాట్లాడినా నేను పట్టించుకోను’ అంటూ తెలియజేశారు దివ్వెల మాధురి.

Read Also: 25 ఏళ్ల తరువాత ఏంటి ?.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>