కలం, ఖమ్మం బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పోలీసులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మహిళా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. పురుషులతోపాటు సమానంగా తమ బాధ్యతలను సమర్థమంతంగా నిర్వరిస్తున్నారన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు విధి నిర్వహణలో కూడా ముందున్నారని ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు.
అలాగే భద్రాచలం సబ్ డివిజన్లో పనిచేస్తున్న మహిళ పోలీసులను (Wome Police) ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఘనంగా సత్కరించారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ సబ్ డివిజన్లోని మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఘనంగా సత్కరించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ కూడా సన్మానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులు రెగ్యులర్ యూనిఫాం స్థానంలో రంగు రంగుల దుస్తులు ధరించి సందడి చేశారు.
Read Also: హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
Follow Us On: Sharechat

