రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు టీ-సాట్ డిజిటల్ కంటెంట్

కలం, వెబ్ డెస్క్ : పోటీ పరీక్షల కోసం అభ్యర్థుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించే టీ-సాట్ (T-SAT) నెట్వర్క్ మరో డిజిటల్ కంటెంట్ ను అందించేందుకు ముందుకు వచ్చింది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు త్వరలో భర్తీ చేసే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు డిజిటల్ కంటెంట్ అందించనున్నట్లు టీ – సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి (Bodanapally Venugopal Reddy) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. వీటిలో సికింద్రాబాద్, ఈస్ట్ కోస్టు రైల్వే డివిజన్ పరిధిలో 1,420 పోస్టులు భర్తీ చేయనున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ యువతకు ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా పరీక్షకు సంబంధించిన కంటెంట్ ను డిజిటల్ లెసన్స్ ద్వార అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మాథమేటిక్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ సైన్స్ కు సంబంధించిన సబ్జెక్టులలో సుమారు 300 గంటల కంటెంట్ రోజుకు రెండు గంటల చొప్పున ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. టీ-సాట్ (T-SAT) విద్య ఛానల్ లో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రసారమయ్యే పాఠ్యాంశాలు నిపుణ ఛానల్‌లో రాత్రి తొమ్మిది గంటల నుండి 11 గంటల వరకు ప్రసారమౌతాయని ఆయన వివరించారు. పదవ తరగతి, ఐటీఐ తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి పరీక్షకు హాజరయ్యే వారికి డిజిటల్ కంటెంట్ ఉపయోగపడుతుందని తెలిపారు. అక్టోబర్‌లో నిర్వహించే రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష కోసం సెప్టెంబర్ వరకు డిజిటల్ లెసన్స్ ప్రసారమౌతాయని వెంకట్ రెడ్డి వెల్లడించారు.

Read Also: బట్టలు త్వరగా పాతబడుతున్నాయా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>