కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. కోల్‌కతా వేదికగా జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆయనతో ఈ ప్రమాణం చేయించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు.
కేంద్ర మంత్రులతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సువేందు అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అభివృద్ధి మార్గంలో బెంగాల్‌ను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ పరిసరాలు జనసందోహంతో కోలాహలంగా మారాయి

