Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు సింగపూర్‌కు మంత్రి లోకేశ్

కలం, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి లోకేశ్ (Minister Lokesh) రేపు సింగపూర్‌ (Singapore) కు వెళుతున్నారు. ఆయన వెంట ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెళుతున్నారు. ఇవాళ్టీ నుంచి ఈనెల 15 వరకు సింగపూర్‌లో ‘రెండవ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ’ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మంత్రి లోకేశ్ హాజరు కానున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఇతర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ పర్యటనకు వెళ్లేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యయాన్ని ప్రణాళిక శాఖ భరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read Also: మర్రిపాడు సమీపంలో బస్సు బోల్తా.. పలువురికి గాయాలు!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>