కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) నూతన ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కేంద్రం మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ క్రమంలో సభ మీదికి వచ్చిన ప్రధాని స్టేజిపై ఎలాంటి ఆహార్యంలో లేకుండా సామాన్యుడిలా ఉన్న ఓ 98 ఏళ్ల పెద్దాయన (Makhan Lal Sarkar) కు శాలువా కప్పి, కౌగిలించుకున్నారు.
అంతే కాకుండా ఆయన కాళ్లకు మోదీ (PM Modi) దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. స్వయంగా దేశ ప్రధానమంత్రి కాళ్లు మొక్కడంతో సభప్రాంగణంలో ఉన్నవాళ్లతో పాటు దేశ ప్రజలు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో ఆ పెద్దాయన ఎవరనేది ఆసక్తికరంగా మారింది
ఆ వృద్ధుడు ఎవరో కాదు బీజేపీ సీనియర్ కార్యకర్త మాఖన్ లాల్ సర్కార్. బెంగాల్ సిరిగురి సింహం పేరుపోందిన మాఖన్ లాల్ ఆర్ఆర్ఎస్ కార్యకర్తగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. భారతీయ జనసంఘ్ లో చేరి ఆ తరువాత బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సహాయకుడిగా ఉన్న మాఖాన్ లాల్ ఆయన అంతిమయాత్రలో కూడా పాల్గొన్నాడని బీజేపీ నేతలు తెలిపారు.
Read Also: బెంగాల్ లో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం: సీఎంగా సువేందు
Follow Us On: WhatsApp

