Mobile Popup Ad
Mobile Popup Ad

కేరళకు కాబోయే ముఖ్యమంత్రి ఫిక్స్..!

కలం, వెబ్ డెస్క్ : కేరళలో (Kerala) కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించిన వేళ సీఎం అభ్యర్థి ఫైనల్ అయ్యినట్లు తెలుస్తోంది. 63 మంది ఎమ్మెల్యేలలో 47 మంది కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కు మద్దతు తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ ప్రతినిధి ముకుల్ వాస్నిక్ మద్దతు పత్రాలతో ఢిల్లీకి బయలుదేరారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.

కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ముందు వరుసలో ఉంటారు. అలప్పుజ లోక్‌సభ సభ్యుడిగా కూడా ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ కూటమి విజయంలో వేణుగోపాల్ అసలైన వ్యూహకర్త అని కేరళలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేశారు. దీంతో కేసీ వేణుగోపాల్ కు కేరళ ముఖ్యమంత్రి పదవి లాంఛనమేనని తెలుస్తోంది. ఇక ఎంపీ పదవికి వేణుగోపాల్ రాజీనామా చేసే అవకాశాలున్నాయి.

కాగా, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ సొంతంగా 63 స్థానాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (22), కేరళ కాంగ్రెస్ (ఏడు) వంటి మిత్రపక్షాలతో కలిసి 102 స్థానాల్లో గెలుపొందింది. అటు పినరయి విజయన్ నేతృత్వంలోని సీపీఎం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు కేవలం 35 స్థానాలు మాత్రమే లభించాయి.

Read Also: విజయ్‌కి కమ్యూనిస్టుల మద్దతు వెనుక కాంగ్రెస్ కీలక నేత

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>