సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట : సూర్యాపేట ఎస్పీ నరసింహ

కలం, నల్లగొండ బ్యూరో : నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట పడుతుందని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు ముందుకు రావాలని సూర్యాపేట (Suryapet) జిల్లా ఎస్పీ నరసింహ (SP Narasimha) తెలిపారు. సూర్యాపేట పట్టణం పోలీస్ స్టేషన్ లో 75 సీసీ కెమెరాలు అనుసంధానంతో ఏర్పాటుచేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ జిల్లా ఎస్పీ నర్సింహా, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ సూర్యాపేట డీఎస్పీ, ఆర్టీవో, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. నేరాల నివారణ, నియంత్రణ, ఛేదనలో సీసీ కెమెరాలకు చాలా ప్రాధాన్యత ఉన్నదన్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలు వ్యాపారస్తులు ముందుకు వచ్చి నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలని కోరారు. అభివృద్ధిలో రోజురోజుకు పురోగతి చెందుతున్న సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో ప్రజల భద్రతకు పోలీసులు కట్టుబడి ఉన్నారన్నారు. నిరంతర నిఘా ఉంచి ప్రజలకు పోలీస్ సేవలను చేరువ చేస్తున్నామన తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా సూర్యాపేట పట్టణంలో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని నిత్యం పర్యవేక్షణ చేయటానికి పట్టణ పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. సీసీటీవీ కెమెరాల నిఘాతో నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.

ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. పట్టణంలో మరింత రక్షణ పెంచడానికి సీసీ కెమెరాలు ఆధునికరిస్తున్నామని తెలిపారు. ఎక్కువ మొత్తంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈ దిశగా ప్రజలను, వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజలు వ్యాపారులు ముందుకు రావాలని, నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: ఎమ్మెల్యే బూతు పురాణం..!? గండ్ర మరో ఆడియో హల్‌చల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>