Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యే బూతు పురాణం..!? గండ్ర మరో ఆడియో హల్‌చల్

కలం, వరంగల్ బ్యూరో : ఆయన ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. వివిధ సమస్యల పరిష్కారం నిత్యం ఆయన వద్దకు జనాలు వస్తుంటారు. తను కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యల తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా పని చేస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉంది. ఎమ్మెల్యే చెప్పిన పని కాదన్నా. ఎదురు మాట్లాడినా వారికి మూడినట్లే. ఎమ్మెల్యే అనే విచక్షణ మరిచి పక్కన ఎవరు ఉన్నారనే విషయాన్ని పట్టించుకోరు. నోరు తెరిస్తే పక్కా బూతులే. జనాలైనా, పార్టీ కార్యకర్తలైనా, ఆఫీసర్లైనా ఆయన బూతు పంచాగానికి బలి కావాల్సిందే. ఇటీవల కాలంలో ఆ ఎమ్మెల్యే (MLA Gandra) దెబ్బకి అన్ని వర్గాలు వణికిపోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా శాయంపేట మండలం మందారిపేట గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ (MLA Gandra Satyanarayana Rao) స్థానిక కాలనీ వాసులపై తిట్లదండకం అందుకున్నారు. రాయలేని పదజాలంతతో తన ప్రతాపాన్ని చూపారు. ప్రస్తుతం ఆ బూతుల ఆడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ మాటలు విన్న వారు ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల భూపాలపల్లి హాస్పిటల్ ని సందర్శించిన గండ్ర డాక్టర్ పై విరుచుకుపడ్డారు. ఇడియట్, వెధవ అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలికి అవాక్కవడం స్థానికుల వంతయింది. ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకుంటుండగా ఏ ఒక్కరు కూడా ఎదురు ప్రశ్నించడం, వారించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘మా ఎమ్మెల్యే తీరుకు మా వాళ్ళు అలవాటు పడ్డారని ఇక్కడ ఇది సహజమే’ అని అక్కడి ప్రజలు, కార్యకర్తలు చెప్పుకోవడం కొసమెరుపు.

Read Also: ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టగానే భట్టి మారిపోయాడు: హరీశ్ రావు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>