కలం, కరీంనగర్ : కరీంనగర్‌లోని దాసరి విజయ కన్వెన్షన్‌లో శనివారం నిర్వహించిన వివాహ వేడుకకు మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) కుటుంబ సమేతంగా హాజరయ్యారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి క్రాస్ రోడ్డు గ్రామానికి చెందిన వంగల నర్సింహరెడ్డి, సులోచన దంపతుల కుమార్తె ఆశ్రిత వివాహానికి ఎమ్మెల్యే తన సతీమణి, అంకిత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ అనురాధ, కుమార్తె శ్రేయా నారాయణ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వివాహ వేడుకకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆకుల నర్సయ్య (కరీంనగర్), కరరేవెల్లి రాజలింగం (మానకొండూర్), మాతంగి శిరీష–అనిల్ కుమార్ (బెజ్జంకి), అంతగిరి సాహిత్య–వినయ్ కుమార్ (ఇల్లంతకుంట), మాజీ ఏఎంసీ చైర్మన్లు పులి కృష్ణ, మర్రి ఓదెలు యాదవ్, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్లు రేవెల్లి శ్రీనివాస్ రెడ్డి, పర్ష సంతోష్, జె.భరత్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి, గోపు తిరుపతి రెడ్డి, ఒగ్గు దామోదర్, ఊట్కూరి వెంకట రమణారెడ్డి, నాగిశెట్టి రాజయ్య, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, రొంటాల లక్ష్మారెడ్డి, గంగుల రాంరెడ్డి, కీసర సంపత్, గోపగోని బస్వయ్య గౌడ్, గాజుల మహేష్ తోపాటు పలువురు వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐ హాజరయ్యారు.
అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, బండారి రమేశ్, బొడ్డు సునిల్, లింగాల శ్రీనివాస్, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు నందగిరి రవీంద్రచారి, ముస్కు ఉపేందర్ రెడ్డి, అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, డి.సంపత్ రెడ్డి, గట్టు తిరుపతి, పి.శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పెంచాల కిషన్ రావు, కట్కం తిరుపతి, గూడెల్లి శ్రీకాంత్, మామిడి రాజు, కర్క చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు ఎలగందుల ప్రసాద్, పార్టీ నాయకులు పులి కృష్ణ, మర్రి ఓదెలు యాదవ్, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కరీంనగర్ – జగిత్యాల రోడ్డు మార్గంలోని వసుధ కన్వెన్షన్ హాల్లో శనివారం జరిగిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టర్ నవీన్ కుమార్ కుమార్తె శ్రీనిధి వివాహానికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

