కలం, వెబ్ డెస్క్: విమానంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు (Ayyappa Devotees) కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పవిత్రమైన ఇరుముడిని విమాన క్యాబిన్‌లో వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. భక్తుల సంప్రదాయం, మనోభావాలను గౌరవిస్తూ.. వరుసగా మూడో ఏడాది కూడా ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు. అయ్యప్ప భక్తులు సాఫీగా ప్రయాణించేలా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవీయేషన్ స్టాండర్డ్స్, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భక్తులు సంతోషంగా శబరిమల యాత్ర చేపట్టవచ్చని.. వారిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. గతంలో అయ్యప్ప భక్తులు విమానంలో వెళ్లాలనుకుంటే ఇరుముడిని వారి వద్ద ఉంచేందుకు అనుమతి ఉండేది కాదు. 2014లో ఈ విధానంపై సమీక్ష చేపట్టిన కేంద్ర మంత్రి.. ఇక నుంచి విమాన క్యాబిన్‌లోకి ఇరుముడిని తీసుకెళ్లేలా నిబంధనలు మార్చాలని ఆదేశించారు.

