వరల్డ్ కప్ గెలుపులో ’10 వేల’ మంత్రం.. రహస్యాలు చెప్పిన సూర్య

కలం, వెబ్ డెస్క్ : టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026)  విజయం వెనుక ఉన్న ఆసక్తికర వ్యూహాలను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బయటపెట్టారు. ముఖ్యంగా ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచేందుకు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఒక అద్భుతమైన ఆలోచన చేశారని, ప్రాక్టీస్ సెషన్లలో ‘బెస్ట్ ఫీల్డర్’ కోసం 10 వేల రూపాయల గిఫ్ట్ అనౌన్స్ చేశారని సూర్య చెప్పాడు. టోర్నీ ఆరంభంలో భారత ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో లేదని స్కై అంగీకరించాడు. కానీ సూపర్ 8లో వెస్టిండీస్‌పై కీలక క్యాచ్‌లు వదిలేసినా, సెమీఫైనల్‌లో అక్షర్ పటేల్ పట్టిన అద్భుత క్యాచ్ మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పిందని సూర్య గుర్తు చేసుకున్నారు. ఆ క్యాచ్ ఒత్తిడి సమయంలో జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.

దక్షిణాఫ్రికా (South Africa) మ్యాచ్ తర్వాత వీడియో అనలిస్ట్ రూపొందించిన పది నిముషాల ప్రత్యేక వీడియోలు ఆటగాళ్లలో కసిని పెంచాయని సూర్య (Suryakumar Yadav) చెప్పారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత నరేంద్ర మోదీ స్టేడియంపై ఉన్న అపనమ్మకాన్ని ఈ విజయంతో చెరిపివేశామని సూర్య స్పష్టం చేశారు. ఫైనల్లో న్యూజిలాండ్‌ (New Zealand) ను ఓడించడం ద్వారా ఆ స్టేడియంతో తమకు ఎలాంటి సమస్య లేదని నిరూపించామని అన్నారు.

బ్యాటింగ్ విభాగంలో శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించగా, తిలక్ వర్మ ఫినిషర్‌గా సత్తా చాటారని కొనియాడారు. ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా ఆటగాళ్లు సోషల్ మీడియాకు, బయటి వార్తలకు దూరంగా ఉన్నారని సూర్య వెల్లడించారు. హోటల్ నుండి ఎయిర్‌పోర్ట్ వరకు అభిమానుల నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి హెడ్‌ఫోన్లు వాడుతూ, డ్రెస్సింగ్ రూమ్‌లో టీవీలు కూడా కట్టేసినట్లు తెలిపారు. యువ ఆటగాళ్లు స్వచ్ఛందంగా సోషల్ మీడియాను పక్కన పెట్టడం ఈ విజయానికి కీలకంగా మారిందని అన్నారు.

Read Also: జాతీయ జెండాను అవమానించారని హార్దిక్ పాండ్యాపై కంప్లైంట్!

Follow Us On: Facebook

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>