Mobile Popup Ad
Mobile Popup Ad

కవిత ఇంటికి సీబీఐ ఆఫీసర్లు.. నోటీసులు అందుకున్న భర్త

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు (Kavitha) సీబీఐ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Scam) ఈ నోటీసులను సీబీఐ అధికారులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇవ్వడం కోసమే సీబీఐ ఆఫీసర్లు ఆమె నివాసానికి వెళ్ళారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితతో సహా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితర మొత్తం 23 మందికి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది.

దీన్ని మూడు రోజుల క్రితం విచారించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ… మొత్తం 23 మందికి నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. దీనికి కొనసాగింపుగా సీబీఐ అధికారులు గురువారం ఉదయం నగరంలోని ఆమె నివాసానికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఈనెల 16 న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమె (Kavitha) భర్త అనిల్ ఈ నోటీసులు అందుకున్నారు.

Read Also: ఎల్పీజీ కొరతపై నిరసన.. పార్లమెంట్‌లో చాయ్ బిస్కట్ ప్రొటెస్ట్..!

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>