సూర్య ‘వీరభద్రుడు’తో 13 ఏళ్ల రికార్డు బ్రేక్

కలం, సినిమా : తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’. తెలుగులో ‘వీరభద్రుడు’ (Veerabhadrudu) గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. విడుదలకు ముందు ఈ సినిమాకు అంత హైప్ లేదు. విడుదల ఆలస్యం కావడం, షోలు క్యాన్సిల్ కావడం లాంటివి ఎదురైన సూర్య సినిమా బాక్స్ ఆఫీసు వద్ద గట్టిగానే నిలబడింది. గత కొంత కాలంగా వరుస పరాజయలు ఎదుర్కొంటున్న సూర్యకు వీరభద్రుడు కాస్త ఊరటనిచ్చింది. విడుదల రోజు యావరేజ్ టాక్ వచ్చినా కానీ వీరభద్రుడికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

మొదటి వీకెండ్‌లోనే ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్‌లో ఏకంగా 3 మిలియన్ మార్క్ దాటింది. ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి అసలు కారణం.. మంచి కథ, దానికి తోడు సూర్య పెర్ఫామెన్స్ ఈ రెండు ప్రేక్షకులను థియేటర్స్‌కి వచ్చేలా చేశాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంతో 2013లో విడుదలైన ‘సింగం 2’ రికార్డులను సూర్య దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సుమారు 13 సంవత్సరాల తర్వాత సూర్య తన సొంత పాత హిట్ రికార్డును తిరిగి అధిగమించినట్లుగా సినీ వర్గాలలో చర్చ జరుగుతోంది. సూర్య అభిమానులు సైతం  సోషల్ మీడియాలో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Read Also: చైనాలో భూకంపం.. ఇద్ద‌రు వ్య‌క్తులు మృతి

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>