కలం, వెబ్‌డెస్క్: బీహార్ (Bihar)లోని ససారం రైల్వే స్టేషన్‌లో సోమవారం ఓ ప్యాసింజర్ రైలు (Passenger Train)లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ససారం-పాట్నా ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌లోని 6వ నంబర్ ప్లాట్ ఫారమ్‌పై రైలు నిలిచి ఉండగా, ఒక బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, అత్యవసర బృందాలు మంటలు వ్యాపించకుండా సదరు బోగీని రైలు నుంచి వేరు చేశారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాద సమయంలో బోగీ నుంచి దట్టమైన నల్లటి పొగలు వ్యాపించడంతో స్టేషన్‌లో కాసుపు గందరగోళం నెలకొంది. అయితే, అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదని, ప్రాణ నష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. కాగా, దీనికి ముందు రోజే మధ్య ప్రదేశ్‌లో కూడా ఢిల్లీ వెళ్తున్న ఓ రైలు ఏసీ బోగీలో అగ్ని ప్రమాదం జరిగింది. వేసవి కాలం కావడం, వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమై దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read Also: ఏఐసీసీ చీఫ్‌గా కేసీ వేణుగోపాల్?
Follow Us On: WhatsApp

