Mobile Popup Ad
Mobile Popup Ad

మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కలం, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఐప్యాక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతుండగా ఆమె నేరుగా జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇటీవల ఐప్యాక్ సంస్థ, ఆ సంస్థ అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. తనిఖీలు జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ (Mamata Banerjee) రాష్ట్ర అధికారులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ల్యాప్‌టాప్, ఫోన్, పత్రాలు తీసుకెళ్లినట్లు ఆమె మీద ఆరోపణలు వచ్చాయి. ఈ వార్తలపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దర్యాప్తు మధ్యలో జోక్యం చేసుకోవడం సరికాదు. రాజ్యాంగ నిర్మాతలు కూడా ఇలాంటి పరిస్థితిని ఊహించి ఉండరు’  అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

మాల్దా ఘటనపై సీరియస్

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని కాళియాచక్-2 బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయంలో జరిగిన ఘటనను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. “ఇది సాధారణ కేసు కాదు. అసాధారణ పరిస్థితి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను విస్మరించలేం” అని పేర్కొంది.

టీఎంసీ వాదన ఏమిటి?

పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ దాడులు రాజకీయ ప్రేరణతో జరిగాయని, ఎన్నికల ముందు తృణముల్ కాంగ్రెస్‌ను (TMC) బలహీనపర్చడానికే ఈ చర్యలు తీసుకున్నారని వాదించింది. సామాజిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోర్టు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇది సాధారణ వివాదం కాదని టీఎంసీ చెబుతున్నది.

Read Also: కల్వకుంట్ల ఫ్యామిలీలో పొలిటికల్ వార్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>