PPP మెడికల్‌ కాలేజీలపై చంద్రబాబు కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల రోజుల్లోనే ఈ పీపీపీ మోడల్ వైద్య కళాశాలల పనులు పట్టాలెక్కాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రెండు దశల్లో ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మొదటి దశలో 4, రెండో దశలో 6 కాలేజీలను నిర్మించనుంది. ఇందులో భాగంగా ఫేజ్‌-1 కింద మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పట్టణాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య విద్యను మరింత చేరువ చేయడంతోపాటు, అత్యాధునిక వసతులతో కాలేజీలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Read Also: పిఠాపురం ప్రోటోకాల్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు సీరియస్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>