కలం, వెబ్ డెస్క్: దేశంలో చిన్నారుల మిస్సింగ్ (Children Missing) ఏటేటా పెరిగిపోతుండటంపై సుప్రీంకోర్ట్ (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 47 వేల మంది చిన్నారులు మిస్సింగ్ అయినట్లు రికార్డులు చెబుతున్నాయని.. వారి భద్రత తమను ఆవేదనకు గురి చేస్తోందని జస్టిస్ మహదేవన్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం పేర్కొంది. ఇక నుంచి చిన్నారుల మిస్సింగ్ కేసులను కిడ్నాప్ కేసులుగా నమోదు చేసి, దర్యాప్తు చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పేవరకు ఈ సమస్య ఇంత తీవ్రంగా తమకు తెలియదని సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.
ప్రత్యేక పోర్టల్ ఏర్పాటుకు ఆదేశాలు..
ఇక నుంచి మిస్సింగ్ అయిన చిన్నారులతో “అఖిల భారత పోలీస్ గ్రిడ్” పేరిట ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీం (Supreme Court) సూచించింది. అంతేగాకుండా, మిస్సింగ్ అయిన చిన్నారుల జాడ లభ్యమయ్యాక వారికి ఆధార్ కార్డు లేకపోతే.. వెంటనే నమోదు చేయాలని కూడా స్పష్టం చేసింది.
Read Also: ప్రతిపాదనలతో రండి.. ప్రాజెక్టులను కలిసి పూర్తి చేద్దాం: జూపల్లి
Follow Us On : WhatsApp

