కలం, వెబ్ డెస్క్ : ఎన్నికల కమిషనర్ల నియామకం (Election Commission), తొలగింపు ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, సమానత్వం పాటించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లకు కూడా ఒకే విధమైన రాజ్యాంగ రక్షణ కల్పించే అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాజ్యాంగంలోని అధికరణ 324(5) నిబంధనలను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంట్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే తరహాలోనే సంక్లిష్టమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. కానీ, ఇతర ఎన్నికల కమిషనర్ల తొలగింపు మాత్రం కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సు ఆధారంగా జరిగిపోతుందని, దీనివల్ల కమిషనర్ల తొలగింపు ప్రక్రియలో వివక్షకు తావు ఏర్పడుతోందని పిటిషనర్ వాదించారు.
కాబట్టి ప్రధాన ఎన్నికల కమిషనర్ (Election Commission) తరహాలోనే ఇతర కమిషనర్లకు కూడా పదవీ భద్రత, తొలగింపు విధానంలో ఒకే విధమైన రక్షణ కల్పించాలని పిటిషనర్ కోరారు. దీంతో కమిషనర్ల స్వతంత్రతను కాపాడటానికి రాజ్యాంగ రక్షణలు ఎంతో అవసరమని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తాజా పిటిషన్ పై తమ స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read : పీవీ సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత!
Follow Us On : WhatsApp

